Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:36 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరోగ్యం–ఆహారంపై అవగాహన సదస్సు

03-02-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెల్నెస్ & లైఫ్ స్టైల్ కోచ్ కుమారి బ్లెస్సి రోజ్ ఆధ్వర్యంలో ఆరోగ్యం, ఆహార అలవాట్లు, పోషక విలువలు అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జగదీష్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో మెలగాలని, తద్వారా మంచి విద్యా ఉత్తీర్ణతలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఆరోగ్యం, విద్య రెండూ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని ఆయన తెలిపారు.సదస్సులో కోచ్ బ్లెస్సి రోజ్ విద్యార్థులకు రోజువారీ ఆహారంలో ఉండాల్సిన పోషక విలువలు, సమతుల్య ఆహారం ప్రాధాన్యత, జీవనశైలి మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు. ఆరోగ్యకరమైన అలవాట్లు భవిష్యత్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మాలే వెంకటరెడ్డి, మందడి వెంకట రెడ్డి, నరసింహ రావు, కొత్త నాగేష్, లైబ్రేరియన్ జానయ్య, అధ్యాపకులు కవిత, రాజేశ్వరి, ఉమారాణి, అలాగే అశోక్ రెడ్డి, శ్రవణ్, పరశురామ్, ల్యాబ్ అటెండెంట్ యాదయ్య పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరోగ్యం–ఆహారంపై అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News