Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:33 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాల వేడుకలు వైభవం

ప్రభుత్వ జూనియర్ కళాశాల వేడుకలు వైభవం

ప్రభుత్వ జూనియర్ కళాశాల వేడుకలు వైభవం
31-01-2026 195 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం, క్రీడోత్సవం, వీడ్కోలు వేడుకలు పట్టణంలోని జీఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ గరిక సత్యనారాయణ, తహసిల్దార్ సి. లాల్ బహదూర్, పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ డి. నాగరాజు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ బుంగ సంజీవ్ కూడా హాజరయ్యారు.

విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు సభను ఉత్సాహభరితంగా మార్చాయి. ఈ సందర్భంగా వెల్లంకి వాస్తవ్యులు లక్ష్మీ మురళీధర్ కళాశాలకు యాభైవేల రూపాయల విలువైన కుర్చీలను విరాళంగా అందించారు.

ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేయనున్న అధ్యాపకుడు కె. పరమేష్‌ను కళాశాల తరఫున ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రసూనాదేవి, పున్నారావు, మాలె వెంకట్ రెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, కిరణ్, నరసింహారావు, అశోక్, నగేష్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జానయ్య, జి. వెంకటేశ్వరరావు, శ్రవణ్, పరశురాములు, నిర్మల, కవిత, రాజేశ్వరి, ఉమారాణి, కరుణ, నాగమణి, నరసయ్య, యాదయ్య, వెంకటయ్య తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాల వేడుకలు వైభవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News