Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:36 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి.జిల్లా వైద్యాధికారి చిన్న నాయక్

04-02-2026 123 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఫిబ్రవరి 4:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచడం ద్వారా ప్రసూతి సేవలను మరింత మెరుగుపరచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చిన్న నాయక్ అన్నారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించిన ఆయన, అనంతరం వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గర్భిణీ మహిళలతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి వైద్యులు అందుబాటులో ఉన్నారని, అవసరమైన అన్ని రకాల మందులు, మెరుగైన వసతులు ఉన్నాయని తెలిపారు. ఈ సౌకర్యాలను గర్భిణీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తదుపరి వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. నెలవారీగా ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆశ కార్యకర్తల సహకారంతో గర్భిణీలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఆపరేషన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. నెలలు నిండిన గర్భిణీలను ముందుగానే గుర్తించి, ప్రభుత్వ ఆసుపత్రులలోనే సురక్షితంగా ప్రసవం జరిగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు సురక్షిత ప్రసవాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు బి వీరన్న, రజిని, స్వాతిబాయి, మాధవాచారి, నవీన్ సింగ్, పి వీణ, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి తదితర నర్సింగ్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి.జిల్లా వైద్యాధికారి చిన్న నాయక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News