Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:13 PM

‘పనికిరాని అక్రిడేషన్ కార్డులు మాకెందుకు?’ ప్రభుత్వంపై భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆగ్రహం

11-02-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, : ప్రభుత్వం జారీ చేసే అక్రిడేషన్ కార్డులు జర్నలిస్టులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో స్పష్టత ఇవ్వాలని భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం గౌడ్ ప్రశ్నించారు. “ప్రయోజనం లేని అక్రిడేషన్ కార్డులు మాకెందుకు?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అక్రిడేషన్ కార్డులు ఉన్నప్పటికీ కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సరైన గుర్తింపు లభించడం లేదని పేర్కొన్నారు. కార్డుల ద్వారా లభించాల్సిన ఆరోగ్య పథకాలు, బీమా సదుపాయాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు. కఠినమైన అర్హతలు, పత్రాల సమర్పణ తర్వాత కార్డులు ఇస్తున్నప్పటికీ, వాటి వల్ల ప్రయోజనం కనిపించడం లేదని విమర్శించారు.జర్నలిస్టుల భద్రత, గౌరవం కోసం అక్రిడేషన్ కార్డులు ఉండాల్సిందిపోయి అవి కేవలం గుర్తింపు కార్డులుగానే మిగిలిపోయాయని అన్నారు. అక్రిడేషన్ ఆధారంగా జారీ చేసిన హెల్త్ కార్డులు ఒక వెల్నెస్ సెంటర్‌కే పరిమితమవుతున్నాయని, ఇతర ఆస్పత్రుల్లో ఉపయోగం లేకపోవడం బాధాకరమన్నారు. పైగా కార్డుల జారీకి అనవసర షరతులు విధించడం సరికాదన్నారు.జర్నలిస్టులకు స్థలాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందుతాయనే హామీలు ఎక్కడ అమలవుతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. అక్రిడేషన్ కార్డులను సక్రమంగా జారీ చేసి, వాటికి అనుబంధంగా ఉన్న అన్ని ప్రయోజనాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Sthanikam

‘పనికిరాని అక్రిడేషన్ కార్డులు మాకెందుకు?’ ప్రభుత్వంపై భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆగ్రహం

Article Image

హైదరాబాద్, : ప్రభుత్వం జారీ చేసే అక్రిడేషన్ కార్డులు జర్నలిస్టులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో స్పష్టత ఇవ్వాలని భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం గౌడ్ ప్రశ్నించారు. “ప్రయోజనం లేని అక్రిడేషన్ కార్డులు మాకెందుకు?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అక్రిడేషన్ కార్డులు ఉన్నప్పటికీ కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సరైన గుర్తింపు లభించడం లేదని పేర్కొన్నారు. కార్డుల ద్వారా లభించాల్సిన ఆరోగ్య పథకాలు, బీమా సదుపాయాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు. కఠినమైన అర్హతలు, పత్రాల సమర్పణ తర్వాత కార్డులు ఇస్తున్నప్పటికీ, వాటి వల్ల ప్రయోజనం కనిపించడం లేదని విమర్శించారు.జర్నలిస్టుల భద్రత, గౌరవం కోసం అక్రిడేషన్ కార్డులు ఉండాల్సిందిపోయి అవి కేవలం గుర్తింపు కార్డులుగానే మిగిలిపోయాయని అన్నారు. అక్రిడేషన్ ఆధారంగా జారీ చేసిన హెల్త్ కార్డులు ఒక వెల్నెస్ సెంటర్‌కే పరిమితమవుతున్నాయని, ఇతర ఆస్పత్రుల్లో ఉపయోగం లేకపోవడం బాధాకరమన్నారు. పైగా కార్డుల జారీకి అనవసర షరతులు విధించడం సరికాదన్నారు.జర్నలిస్టులకు స్థలాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందుతాయనే హామీలు ఎక్కడ అమలవుతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. అక్రిడేషన్ కార్డులను సక్రమంగా జారీ చేసి, వాటికి అనుబంధంగా ఉన్న అన్ని ప్రయోజనాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News