Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:02 AM

పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!

పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!

పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!
13-03-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బస్టాండ్‌లో కనిపించకుండా పోయిన మహిళ… ప్రియుడితో పరారైందా?

పకోడీలు తెచ్చేందుకు వెళ్లిన భర్త తిరిగి వచ్చేలోపే భార్య అదృశ్యమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్ తన భార్య రిమ్ జిమ్‌ను తల్లిగారింటి నుంచి తిరిగి ఇంటికి తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో వారు మొరాదాబాద్ జిల్లాలోని బిలారి బస్టాండ్ వద్ద ఆగారు. అక్కడ రిమ్ జిమ్ పకోడీలు తినాలని భర్తను అడిగింది.

దాంతో ప్రీతమ్ పకోడీలు తెచ్చేందుకు వెళ్లగా, తిరిగి వచ్చేసరికి రిమ్ జిమ్ అక్కడ కనిపించలేదు. బస్టాండ్ పరిసరాల్లో ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో ప్రీతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రిమ్ జిమ్ తన పుట్టింటి గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి పరారై ఉండవచ్చని ప్రీతమ్ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్ పరిసరాల సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అలాగే ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు

Sthanikam

పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News