Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:13 AM

పింఛన్ల పెంపుపై ప్రభుత్వ ‘గుడ్ న్యూస్’… ముందస్తు లబ్ధి దివ్యాంగులకే

06-01-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీల అమలే లక్ష్యంగా ఆసరా పింఛన్ల పెంపు, ప్రత్యేక సంక్షేమ పథకాలపై ప్రభుత్వం వేగం పెంచింది. ఈ క్రమంలోనే ముందుగా దివ్యాంగులకు నెలకు రూ.6,000 పింఛన్ అమలు చేయాలనే దిశగా కసరత్తు కొనసాగుతోంది.ప్రస్తుతం వృద్ధులు, ఇతర వర్గాలకు అందుతున్న రూ.2,016 ఆసరా పింఛన్‌ను రూ.4,000కు, దివ్యాంగులకు ఇస్తున్న రూ.4,016 పింఛన్‌ను రూ.6,000కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ఆర్థిక శాఖతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. ఆర్థిక భారం, అమలు సాధ్యతలను పరిశీలించిన అనంతరం దశలవారీగా పెంపును అమలు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా దివ్యాంగులకు పెంపు వర్తింపజేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఆర్థిక శాఖ ప్రణాళికలు… దశలవారీ అమలు ఎన్నికల హామీ మేరకు పింఛన్ల పెంపును క్రమబద్ధంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఆర్థిక శాఖ ప్రణాళికల ప్రకారం ముందుగా దివ్యాంగులకు రూ.6,000 పింఛన్ అమలు చేసి, అనంతరం వృద్ధులు, ఇతర వర్గాలకు రూ.4,000 పింఛన్ వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పింఛన్లతో పాటు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం.44 లక్షల మంది లబ్ధిదారులు హైదరాబాద్ మలక్‌పేటలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 44 లక్షల మంది వివిధ వర్గాల ప్రజలు ఆసరా పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించినట్లు, త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.విద్య, వివాహ ప్రోత్సాహకాలపై కీలక నిర్ణయాలు విద్యా రంగంలోనూ దివ్యాంగుల కోసం కీలక మార్పులు రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంధులు, బధిర విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ప్రారంభించేందుకుప్రణాళికలుసిద్ధమవుతున్నాయి. బ్రెయిలీ లిపి పుస్తకాలను పదో తరగతి వరకే కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి వరకు విస్తరించనున్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా సుమారు 8 వేల మందికి ఉచిత సహాయక పరికరాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అలాగే దివ్యాంగ జంటల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకంతో పాటు అదనంగా మరో లక్ష రూపాయల ప్రోత్సాహకం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.కొత్తగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలు అమలైతే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది దివ్యాంగ కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా గణనీయమైన ఊరట లభించనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Sthanikam

పింఛన్ల పెంపుపై ప్రభుత్వ ‘గుడ్ న్యూస్’… ముందస్తు లబ్ధి దివ్యాంగులకే

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News