Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:26 PM

ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. 33 ఏళ్ల పాటు జీతం

17-03-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆర్‌టీఐతో బయటపడిన మోసం.. నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష

నకిలీ పత్రాల సాయంతో ఒకేసారి రెండు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేస్తూ 33 ఏళ్ల పాటు జీతభత్యాలు పొందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా ఈ మోసం బయటపడింది. విచారణ జరిపిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించింది.

ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం బారాబంకి జిల్లాకు చెందిన ప్రభాత్ సింగ్ 2009 ఫిబ్రవరి 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్రీఖ్ ప్రాంతానికి చెందిన జయప్రకాష్ సింగ్ నకిలీ పత్రాలతో రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించాడని ఆరోపించారు.

విచారణలో జయప్రకాష్ సింగ్ 1979 డిసెంబర్ 26న ప్రతాప్‌గఢ్ జిల్లాలో నాన్ మెడికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరినట్లు వెల్లడైంది. అనంతరం 1993 జూన్‌లో బారాబంకి జిల్లాలోని ప్రాథమిక విద్యా శాఖలో ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. ఈ రెండు పదవుల్లో ఒకేసారి కొనసాగుతూ దశాబ్దాల పాటు రెండు శాఖల నుంచి జీతభత్యాలు పొందినట్లు దర్యాప్తులో తేలింది.

దీనిపై పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం ప్రధాన న్యాయ మేజిస్ట్రేట్ సుధా సింగ్ నిందితుడిని దోషిగా తేల్చారు. జయప్రకాష్ సింగ్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

Sthanikam

ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. 33 ఏళ్ల పాటు జీతం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News