Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:11 PM

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

17-02-2026 221 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రావణ నక్షత్రంలో శివపార్వతుల దివ్య కల్యాణం

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు సోమవారం (16-02-2026) భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఉదయం గణపతిపూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు నిత్యార్చన, అభిషేకం, బిల్వార్చన, మంత్రపుష్పం వరకు శాస్త్రోక్తంగా సాగాయి. సాయంత్రం స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు.

రాత్రి 11 గంటలకు శ్రావణ నక్షత్ర యుక్త వృషభ లగ్న శుభముహూర్తంలో సిద్ధాంతి బెతోజి సత్యనారాయణ శాస్త్రి అర్చక బృందం ఆధ్వర్యంలో పాదార్చనాభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం (తలంబ్రాలు) వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

మంగళవాయిద్యాల నాదం, హారతుల వెలుగులు, భక్తుల హర్షధ్వానాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. వేలాది మంది భక్తులు స్వామివారి దివ్య కల్యాణాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

Sthanikam

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News