Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:05 PM

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
06-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తి శ్రద్ధలతో స్వామివారి చక్రతీర్థం

నేటితో ముగియనున్న శ్రీ శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

నార్కెట్‌పల్లి మండలంలోని ప్రసిద్ధ హరిహర క్షేత్రం గోపులాపల్లి శ్రీ శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా, భక్తుల అపూర్వ భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం హోమములు, బలిహరణం ఘనంగా నిర్వహించగా, మధ్యాహ్నం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారి కోనేరులో వేదమంత్రోచ్చారణల మధ్య చక్రతీర్థం అత్యంత భక్తిభావంతో నిర్వహించారు.సాయంకాలం స్వామి–అమ్మవార్ల సన్నిధిలో దోపోత్సవ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి–అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.గతంతో పోలిస్తే గుట్టపై వసతులు మెరుగుపడటంతో వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆలయ అభివృద్ధి పనుల కారణంగా ఈసారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల హాజరు మరింతగా పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.

జనవరి 29న ప్రారంభమైన శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా శతకలశాభిషేకం, ధ్వజపట ఉద్వాసన, దేవత ఉద్వాసన, పుష్పయాగం, ఏకాంత సేవలు, పవళింపు సేవలతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ అర్చకులు, యజ్ఞాచార్యులు ప్రతాపురం మత్స్యగిరి స్వామి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమాల్లో అర్చక బృందం, ఆలయ సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

Sthanikam

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News