Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:09 PM

నీర్నంల కమాన్ వద్ద శాస్త్రబద్ధంగా లింగ ప్రతిష్ఠాపన

17-02-2026 414 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక శోభ

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాల సందర్భంగా నీర్నంల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాల ఆర్చ్ తోరణం వద్ద కమాన్ సమీపంలో శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.

బేతోజు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోక్త విధానంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక పూజల మధ్య లింగ ప్రతిష్ఠాపన నిర్వహించారు. వేదమంత్రాల నాదం మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామం అంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

ఈ కార్యక్రమంలో నిర్నముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్, నిదానపల్లి ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ, నాయకులు నారపాక యాదయ్య, కొండ మల్లేశం గౌడ్, ఆగు లింగస్వామి, బొడ్డుపల్లి సతీష్, మాజీ సర్పంచ్ ఆవుల నరసింహ యాదవ్, ఆవుల క్రాంతి కుమార్ యాదవ్, కట్ట కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీర్నంల కమాన్ వద్ద శాస్త్రబద్ధంగా లింగ ప్రతిష్ఠాపన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News