Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:32 AM

నేడు ఏపీలో బిల్ గేట్స్ పర్యటన

నేడు ఏపీలో బిల్ గేట్స్ పర్యటన

నేడు ఏపీలో బిల్ గేట్స్ పర్యటన
16-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌తో కీలక అంశాలపై గేట్స్ చర్చలు,విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సహకారంపై ప్రధానంగా దృష్టి

ఆర్‌టీజీఎస్ కేంద్రం, ఉండవల్లి పొలాలను సందర్శించనున్న బిల్ గేట్స్

గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టును విస్తరించనున్న ప్రభుత్వం

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు ఆయన తన బృందంతో కలిసి ఏపీకి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌లతో సమావేశమవుతారు. ఆదివారం అందిన సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించి, పాలనలో సాంకేతికత వినియోగాన్ని పరిశీలిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, అధికారులతో బిల్ గేట్స్ బృందం సమావేశమవుతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే అమలవుతున్న ప్రాజెక్టులను మరింతగా విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ లక్ష్యాల సాధనకు చేపట్టిన సంస్కరణలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, మెడ్‌టెక్, సంజీవని వంటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్‌కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టు పనితీరును ప్రభుత్వం ఆయనకు ప్రత్యేకంగా వివరించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సమావేశాల అనంతరం, బిల్ గేట్స్ బృందం అమరావతిలోని ఉండవల్లి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుంది. అక్కడ డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహాయంతో చేపడుతున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిశీలించనుంది.

Sthanikam

నేడు ఏపీలో బిల్ గేట్స్ పర్యటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News