Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:19 AM

న్యాల్కల్‌లో భాజపా శ్రేణుల ముందస్తు అరెస్ట్

24-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్లనున్న భాజపా శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవుతారనే సమాచారంతో తెల్లవారు జామునే పోలీసులు చర్యలు చేపట్టారు.స్థానిక హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాజపా నాయకుల ఇళ్లకు చేరుకున్న పోలీసులు, మండలంలోని ప్రముఖ నాయకులు మరియు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు గంగ్వార్ మల్లేష్‌తో పాటు న్యాల్కల్, ముంగి, వడ్డీ, రత్నాపూర్, హద్నూర్, గుంజేట్టి తదితర గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గంగ్వార్ మల్లేష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భాజపా శ్రేణులు ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేపడతాయని ఆయన పేర్కొన్నారు.అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ అరెస్టులు చేపట్టినట్లు సమాచారం.

Sthanikam

న్యాల్కల్‌లో భాజపా శ్రేణుల ముందస్తు అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News