Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:46 AM

నారాయణఖేడ్ 5వ వార్డులో మొరం రోడ్డు మరమ్మత్తులు

09-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు.ఎమ్మెల్యే సంజీవ రెడ్డి,ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సూచనల మేరకు ఈ రోజు మొరం వేసి తాత్కాలిక రోడ్డు మరమ్మత్తులు నిర్వహించారు.మున్సిపాలిటీ పరిధిలోని మైతప్ పటేల్ కాలనీలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గుంతలుగా మారాయి.ఈ సమస్యతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే అధికారులను ఆదేశించి మొరం వేసి రోడ్డు మరమ్మత్తులు చేయించారు.ఈ సందర్భంగా ప్రజలు, వాహనచోదకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అవసరమైతే మరోసారి మొరం వేసే అవకాశం ఉందని నారాయణఖేడ్ మున్సిపాలిటీ 5వ వార్డు సభ్యుడు బాణపురం రాజు తెలిపారు.అలాగే కాలనీలో అతి త్వరలోనే శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్డు పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.ఈ చర్యలతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

నారాయణఖేడ్ 5వ వార్డులో మొరం రోడ్డు మరమ్మత్తులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News