Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు వర్సిటీలను బంధుగణంతో నింపేసి భ్రష్టుపట్టించారు

05-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: రాష్ట్ర విద్య, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేశ్ శాసనసభలో విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్లపై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం తీవ్రంగా దెబ్బతిందని, విశ్వవిద్యాలయాలను బంధువులతో నింపేసి భ్రష్టుపట్టించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థిని సొంత బిడ్డలా భావించాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.

జీవో 117తో విద్యావ్యవస్థ కుప్పకూలింది

గత పాలకులు తీసుకొచ్చిన జీవో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతిన్నాయని మంత్రి మండిపడ్డారు. ఐదేళ్లలో 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారని తెలిపారు. డ్రాప్ బాక్స్ విధానాన్ని దుర్వినియోగం చేసి లక్షలాది పిల్లల పేర్లతో నిధులు డ్రా చేశారని ఆరోపించారు. కేవలం గణాంకాల మేనేజ్‌మెంట్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.

ప్రమాణాలు పడిపోయాయి

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు గణనీయంగా తగ్గిపోయాయని మంత్రి వెల్లడించారు. 5వ తరగతి విద్యార్థుల్లో భాషా పట్టు తగ్గిందని, జాతీయ స్థాయి సర్వేల్లో రాష్ట్ర ర్యాంకులు పడిపోయాయని తెలిపారు. ఉపాధ్యాయులను ఇతర పనులకు వాడటం విద్యావ్యవస్థకు అవమానకరమన్నారు.

యూనివర్సిటీల్లో అక్రమ నియామకాలు

విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు. వీసీలుగా, ఉన్నత పదవుల్లో అర్హతలేని వారిని నియమించారని, బంధువులకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయలు పేరుకుపోయాయని తెలిపారు.

సంస్కరణల దిశగా ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో ప్రక్షాళన ప్రారంభమైందని మంత్రి పేర్కొన్నారు. జీవో 117 రద్దు చేసి, సింగిల్ టీచర్ విధానానికి ముగింపు పలికామని తెలిపారు. 150 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల పోస్టులు భర్తీ చేశామని గుర్తుచేశారు. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.

ఎమ్మెల్యేలకు పిలుపు

ప్రతి ఎమ్మెల్యే రెండు పాఠశాలలను దత్తత తీసుకుని వారానికొకసారి సందర్శించాలని సూచించారు. పాసివ్ లెర్నింగ్‌కు బదులుగా యాక్టివ్ లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అమరావతిలో ప్రపంచ స్థాయి సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

రాష్ట్రాన్ని విద్యా హబ్‌గా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

Sthanikam

నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు వర్సిటీలను బంధుగణంతో నింపేసి భ్రష్టుపట్టించారు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News