Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 01:04 PM

నూతన అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల జేఏసీ డిమాండ్

27-12-2025 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నూతన అక్రిడేషన్ జారీ ప్రక్రియ జీవోను తక్షణమే సవరించాలని కోరుతూ జర్నలిస్టు సంఘాల జేఏసీ శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కీలక సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడిన టీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమన్న, టీజేఎస్ఎస్ అధ్యక్షుడు ఆనించిన్ని వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి నూతన అక్రిడేషన్ జీవోలోని పలు నిబంధనలు జర్నలిస్టులకు అన్యాయం చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అక్రిడేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులు, ఉపాధి భద్రతకు భంగం కలగకుండా అన్ని సంఘాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో ఆయా యూనియన్లకు చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల జేఏసీ డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News