Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:26 PM

నామినేషన్ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలి – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు

29-01-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చౌటుప్పల్:స్థానికం ప్రధాన ప్రతినిధి

నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు.

గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వార్డు స్థానాలకు ఎంతమంది నామినేషన్‌లు దాఖలు చేశారన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్‌ల స్వీకరణ నిబంధనల ప్రకారం జరుగుతోందా లేదా అన్న అంశాన్ని సవివరంగా పరిశీలించారు.

నామినేషన్‌ల స్వీకరణ కేంద్రాలలో ఏర్పాటు చేసిన సదుపాయాలు, సహాయ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు, సంబంధిత రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్‌లు సమర్పించే సమయంలో చిన్నపాటి పొరపాట్లకూ అవకాశం లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.అలాగే నామినేషన్ పత్రాలకు జతచేయాల్సిన ధ్రువపత్రాలు పూర్తిగా ఉన్నాయా లేదా అని నిర్ధారించాలని ఆదేశించారు. నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని, నిబంధనల అమలులో కట్టుదిట్టంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంబంధిత నివేదికలను నిర్దేశిత అనువర్తనంలో సమయానికి నమోదు చేయాలన్నారు.

Sthanikam

నామినేషన్ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలి – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News