Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

నిమ్స్ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం

నిమ్స్ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం

నిమ్స్ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం
29-12-2025 623 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

నిమ్స్ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం.

ఆర్జిత సెలవుల నగదు మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సర్కార్ జీవో.

మాట నిలబెట్టుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ.

అందోల్, స్థానికం ప్రతినిధి:

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఉద్యోగుల ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. వారు కోరుతున్నట్టుగా ‘ఆర్జిత సెలవుల నగదు మార్పిడి (earned leaves encashment)’కి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో, నిమ్స్ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో నం. 230) జారీ చేసింది.

ఎయిమ్స్ పే స్కేల్స్ పొందుతున్న నిమ్స్ రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం లేదు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నాయి. ఇటీవల హాస్పిటల్ నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి తమ సమస్యను విన్నవించారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న 'తెలంగాణ లీవ్ రూల్స్-1933' నిబంధనల ప్రకారమే, ఇకపై నిమ్స్ ఉద్యోగులు కూడా తమ ఆర్జిత సెలవులను సరెండర్ చేసి నగదు పొందవచ్చు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు సోమవారం జీవో విడుదల చేశారు.

ఉద్యోగుల హర్షం:

తమ కష్టాన్ని గుర్తించి, చిరకాల కాంక్షను నెరవేర్చినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి నిమ్స్ ఉద్యోగ వర్గాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుందని వారు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

నిమ్స్ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News