Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

నాలుగు రోజులు బ్యాంకులు మూత… ఖాతాదారులకు స్వల్ప అసౌకర్యం

24-01-2026 217 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు అందుబాటులో ఉండవు. జనవరి 24వ తేదీ నాలుగో శనివారం, 25వ తేదీ ఆదివారం, 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండగా, 27వ తేదీన బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి.

వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా నాలుగు రోజుల పాటు కౌంటర్ సేవలు నిలిచిపోనున్నాయి.అయితే ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎంలు, ఆన్‌లైన్ లావాదేవీలు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. నగదు అవసరాలు ఉన్న వారు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో చెక్కుల క్లియరెన్స్, కౌంటర్ లావాదేవీలు, కొత్త ఖాతాల ప్రారంభం వంటి సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర బ్యాంకు పనులను ఖాతాదారులు ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకు వర్గాలు కోరుతున్నాయి.

Sthanikam

నాలుగు రోజులు బ్యాంకులు మూత… ఖాతాదారులకు స్వల్ప అసౌకర్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News