Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:45 PM

నల్లగొండలో పిస్తా హౌస్ ప్రారంభం – సూపర్ స్మార్ట్ సిటీ లక్ష్యమే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండలో పిస్తా హౌస్ ప్రారంభం – సూపర్ స్మార్ట్ సిటీ లక్ష్యమే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండలో పిస్తా హౌస్ ప్రారంభం – సూపర్ స్మార్ట్ సిటీ లక్ష్యమే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
February 21, 2026 06:57 PM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పిస్తా హౌస్ బ్రాంచ్ ప్రారంభం కావడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

శనివారం హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్‌ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండను వ్యాపార, వాణిజ్యపరంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా మాత్రమే కాకుండా గ్రీన్ సిటీగా కూడా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు దీటుగా అన్ని వసతులతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. చెత్త రహిత నగరంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు.

రెండు సంవత్సరాల్లోనే నల్లగొండను మోడల్ సిటీగా రూపుదిద్దించి, ఇతర పట్టణాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి తీసుకెళ్తామని మంత్రి వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పిస్తా హౌస్ బ్రాంచ్‌ను నల్లగొండలో ఏర్పాటు చేసిన నిర్వాహకులను మంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్ ఇటికల మంగమ్మ శ్రీనివాస్, ఇతర కార్పొరేటర్లు, నిర్వాహకులు కొణతం నాగిరెడ్డి, వినయ్ రెడ్డి, మిథున్ రెడ్డి, నవ కిషోర్ రెడ్డి, కొణతం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News