Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:17 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన ఉత్సవ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్లు

05-02-2026 436 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ పరిధిలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ శివరాత్రి నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఆలయ ఉత్సవ కమిటీని గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్‌ చల్ల నరసింహతో పాటు డైరెక్టర్లు గురువారం చిట్యాలలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తుల విశ్వాసానికి తగ్గట్టుగా నిర్వహించాలనే సంకల్పాన్ని కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వివరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనలో ప్రజాప్రతినిధుల సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్యే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ చైర్మన్‌ చల్ల నరసింహను డైరెక్టర్లు సంకు స్వామి, కడారి మల్లేశం అంగడయ్య, భాషమల్ల బాలరాజు, ఆగు చిన్న లింగస్వామి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో నిదానపల్లి మాజీ సర్పంచ్ గుత్తా నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు పూస బాలకృష్ణ, మందడి ప్రభాకర్ రెడ్డి, గ్రామ పెద్దలు దయ్యాల బిక్షమయ్య, చల్ల శ్రీశైలం, నారపాక యాదయ్య, కొండమల్లయ్య, బొడిగే రంగయ్య, కొండ శేఖర్, తోటకూర ఐలయ్య, ఏకుల మల్లేశం, బొబ్బూరి నరసింహ, భాషమల్ల సంతోష్, కడారి మల్లేశం, నారపాక జడ్జి తదితరులు హాజరయ్యారు.

Sthanikam

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన ఉత్సవ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్లు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News