Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:08 AM

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి

23-02-2026 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రజక ఫౌండేషన్ ముంబై డిమాండ్

రజక ఫౌండేషన్ ముంబై నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 18న గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబం టికెట్ లేకుండా ఆలయంలోకి ప్రవేశించిందనే ఆరోపణలతో గ్రామ సర్పంచ్ సహా అగ్రకుల పెత్తందారులు దుర్భాషలాడుతూ, విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపించారు.

దాడి సమయంలో రెండు నెలల పసిపాపను కిరాతకంగా తన్నడంతో మృతి చెందిందని ఫౌండేషన్ నాయకులు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉండాల్సిన వారు అధికారం దుర్వినియోగం చేస్తూ అత్యంత వెనుకబడిన వర్గాలపై దాడులు చేయడం అమానుషమని ఖండించారు.

పసిపాప మృతికి కారణమైన వారిపై వెంటనే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించి, తగిన నష్టపరిహారం ప్రకటించడంతో పాటు వైద్య ఖర్చులను నిందితులే భరించాలని కోరారు.

ప్రజా పాలన అని చెప్పుకునే ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ మేరకు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహేంద్ర చింతలతాడేపు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

Sthanikam

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News