Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:49 AM

నేటి తరానికి ఆదర్శం సావిత్రి భాయి పూలే జీవితం

03-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాకారం లావణ్య,రత్నపురం పద్మ

భువనగిరి స్థానికం ప్రతినిధి

చదువుల తల్లి, సామాజిక ఉద్యమకారిణి సావిత్రి భాయి పూలే జీవితాన్ని ,నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు బాకారం లావణ్య, జిల్లా అధ్యక్షురాలు రత్నపురం పద్మ లు పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి పట్టణ శివారులోని శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ పాఠశాలలో జరిగిన సావిత్రి భాయి పూలే 196వ జయంతి వేడుకల్లో వారు పాల్గొని మాట్లాడారు. మొదట సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మండల విద్యాధికారి బండారు రవివర్దన్ మాట్లాడుతూ సుమారు 180 సంవత్సరాల క్రితమే అమ్మాయిలు, మహిళలు చదువుకోవాలని, సుమారు 18 మహిళా పాఠశాలలు ఏర్పాటు చేసి చదువు చెప్పిన సావిత్రి భాయి పూలే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని కొనియాడారు. జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్ మాట్లాడుతూ బాల్యవివాహాల నిషేధానికి, వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ, సతీ సహగమనం కు వ్యతిరేకంగా పోరాడిన సావిత్రి భాయి పూలే చరిత్రను మరవకూడదు న్నారు. జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు ఎర్ర శివరాజ్ మాట్లాడుతూ సావిత్రీబాయి పూలే,జ్యోతిరావు పూలే మరియు అంబేడ్కర్ లాంటి మహానుభావుల త్యాగాల ఫలితమే దేశంలో "ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం" వచ్చిందన్నారు. నేటి బాలబాలికలు సావిత్రి భాయి పూలే ను స్పూర్తిగా తీసుకుని ఉత్తమ పౌరులుగా, ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే సావిత్రి భాయి పూలే,జ్యోతిరావు పూలే దంపతులకు భారత రత్నతో గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ ఆదర్శ దంపతుల జీవితాన్ని పాఠ్యాంశం లో చేర్చాలని కోరారు. పాఠశాల కరస్పాండెంట్ తోటకూర యాదయ్య మాట్లాడుతూ బాలబాలికలు చదువులో పోటిపడి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. సమావేశంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ తోటకూర సంతోష, మహిళా ఉపాద్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నేటి తరానికి ఆదర్శం సావిత్రి భాయి పూలే జీవితం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News