Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

లక్ష్య సాధనకు పట్టుదల అవసరం

లక్ష్య సాధనకు పట్టుదల అవసరం

లక్ష్య సాధనకు పట్టుదల అవసరం
11-04-2026 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

​గెస్ట్ లెక్చర్‌లో ప్రముఖ న్యాయవాది చెరుకు శివకుమార్ గౌడ్

​విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఈఏపీసెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించవచ్చని ప్రముఖ న్యాయవాది, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులకు ఆయన శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. పరీక్షల్లో గరిష్ట మార్కులు సాధించడానికి అనుసరించాల్సిన మెళకువలను వివరించారు. సమయపాలన పాటిస్తూ, క్లిష్టమైన అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం రత్నం ఫౌండేషన్ వారు ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణ శిబిరాన్ని సందర్శించిన శివకుమార్ గౌడ్‌ను రత్నం ఫౌండేషన్ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. సామాజిక స్పృహతో ఆయన అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

లక్ష్య సాధనకు పట్టుదల అవసరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News