Sthanikam - Truth Matters
Logo

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు సాగాలి: సర్పంచ్ కాటం వెంకటేశం

Updated : 11 Apr 2026 13:29 IST
As Preferred Source 1 min read
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు సాగాలి: సర్పంచ్ కాటం వెంకటేశం

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామపంచాయతీ పరిధిలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు నేటి రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో శిఖరాలను అధిరోహిస్తున్నారంటే, పూలే దంపతులు చేసిన కృషి ఎంతో గొప్పదని తెలిపారు. ముఖ్యంగా సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు విద్యా వెలుగులు ప్రసరింపజేశారని కొనియాడారు.సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ప్రస్తుత సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. మహాత్మా పూలే ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కురు యాదయ్య, జల ప్రశాంత్, సాగర్ నాగరాజు, నూతి వెంకన్న, బుంగపట్ల తిమ్మయ్య, మొర శీను, పున్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు సాగాలి: సర్పంచ్ కాటం వెంకటేశం

Article Image

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామపంచాయతీ పరిధిలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు నేటి రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో శిఖరాలను అధిరోహిస్తున్నారంటే, పూలే దంపతులు చేసిన కృషి ఎంతో గొప్పదని తెలిపారు. ముఖ్యంగా సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు విద్యా వెలుగులు ప్రసరింపజేశారని కొనియాడారు.సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ప్రస్తుత సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. మహాత్మా పూలే ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కురు యాదయ్య, జల ప్రశాంత్, సాగర్ నాగరాజు, నూతి వెంకన్న, బుంగపట్ల తిమ్మయ్య, మొర శీను, పున్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి