హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి
మునిపంపుల గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం–కాయ వారి కుటుంబ సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ తన నివాసంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ గంగపుత్రులు రాజకీయంగా, ఆర్థికంగా మరింతగా ఎదగాలని, సమాజంలో ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం మునిపంపుల గంగపుత్రులు, కాయ వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాయ ఆంజనేయులు, కాయ ఉపేందర్ ఉప్పలయ్య, కాయ ఉపేందర్, కాయ రాము, కాయ సాయిబాబు, కాయ గణేష్, కాయ మధుబాబు, కాయ సాయినాథ్, కాయ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి