Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:24 PM

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి

04-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సాధారణ పరిశీలకులు గౌతమి సమక్షంలో జరిగింది.ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ సిబ్బంది కేటాయింపు చేపట్టారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగేలా అదనపు కలెక్టర్, సాధారణ పరిశీలకులు నిశితంగా పర్యవేక్షించారు.జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించనున్న వార్డు ఎన్నికల పోలింగ్ విధులకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.

జిల్లాలో మొత్తం 104 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నిర్వహణ సజావుగా సాగేందుకు 20 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, ఇతర పోలింగ్ అధికారులు 514 మందిని కేటాయించారు.ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

Sthanikam

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News