Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:34 PM

మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ పర్యవేక్షణ

మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ పర్యవేక్షణ

మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ పర్యవేక్షణ
02-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పారదర్శకత, నిష్పక్షపాతతే లక్ష్యం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు.

సోమవారం యాదాద్రి రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పనులను జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించారు. వార్డుల వారీగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో, అందులో ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపసంహరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ఇప్పటివరకు పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన పార్టీ ఫారాలు సమర్పించారా అనే అంశాన్ని పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులకు అక్షర క్రమంలో ఎన్నికల గుర్తులు కేటాయించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ అంతా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగాలని స్పష్టం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ పర్యవేక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News