Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

06-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న నిర్లక్ష్యానికీ తావు లేకుండా పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసే ప్రధాన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనన్నారు.

పోలింగ్‌కు సంబంధించిన ప్రతి సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ పెట్టెలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్ పెట్టె తెరవడం, ముద్ర వేయడం వంటి ప్రక్రియల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా, నిక్షేపంగా సాగాలని స్పష్టం చేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News