Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

మున్సిపల్ ఎన్నికల్లో 48 గంటల నిబంధన తప్పనిసరి. కలెక్టర్ హనుమంతరావు

05-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకొని, పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలన్నీ 48 గంటల నిబంధనను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు స్పష్టం చేశారు.పోలింగ్ ముగిసే ముందు 48 గంటల వ్యవధిలో ఎలాంటి ఎన్నికల ప్రచారం సాగకూడదని తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడమే కాకుండా ప్రచార సంబంధిత విషయాలను ఎలాంటి మాధ్యమాల ద్వారా కూడా కొనసాగించరాదని పేర్కొన్నారు.

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తెలంగాణ మున్సిపాలిటీ చట్టం–2019లోని సెక్షన్ 209 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని తెలిపారు.స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, మాధ్యమాల యాజమాన్యాలు సహకరించాలని కలెక్టర్ కోరారు. 48 గంటల నిబంధనను అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో 48 గంటల నిబంధన తప్పనిసరి. కలెక్టర్ హనుమంతరావు

Article Image

రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకొని, పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలన్నీ 48 గంటల నిబంధనను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు స్పష్టం చేశారు.పోలింగ్ ముగిసే ముందు 48 గంటల వ్యవధిలో ఎలాంటి ఎన్నికల ప్రచారం సాగకూడదని తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడమే కాకుండా ప్రచార సంబంధిత విషయాలను ఎలాంటి మాధ్యమాల ద్వారా కూడా కొనసాగించరాదని పేర్కొన్నారు.

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తెలంగాణ మున్సిపాలిటీ చట్టం–2019లోని సెక్షన్ 209 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని తెలిపారు.స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, మాధ్యమాల యాజమాన్యాలు సహకరించాలని కలెక్టర్ కోరారు. 48 గంటల నిబంధనను అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News