Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 05:08 PM

మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం.. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు

19-01-2026 354 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి ప్రధాన స్థానికం ప్రతినిధి :మున్సిపల్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సమన్వయ బాధ్యతలను బలోపేతం చేసే ఉద్దేశంతో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్‌ నాయకులకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహ రూపకల్పన, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో ఈ ఇన్‌చార్జ్‌లు కీలక పాత్ర పోషించనున్నారు.ఈ మేరకు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సుదర్శన్‌ రెడ్డిని, నిజామాబాద్‌కు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని నియమించారు. మల్కాజ్‌గిరి బాధ్యతలను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అప్పగించగా, చేవెళ్ల నియోజకవర్గానికి శ్రీధర్‌బాబు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు. మెదక్‌కు వివేక్‌, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావును బాధ్యతలు అప్పగించారు.అలాగే నల్గొండ నియోజకవర్గానికి అడ్లూరి లక్ష్మణ్‌, భువనగిరికి సీతక్క, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు. మహబూబ్‌నగర్‌కు పొన్నం ప్రభాకర్‌తో పాటు దామోదర రాజనర్సింహాకు బాధ్యతలు కేటాయించగా, జహీరాబాద్‌కు అజహరుద్దీన్‌, నాగర్‌కర్నూల్‌కు వాకిటి శ్రీహరి, ఖమ్మం నియోజకవర్గానికి కొండా సురేఖను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించారు.మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు అనుభవజ్ఞులైన నేతలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా తెలుస్తోంది.

Sthanikam

మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం.. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News