Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

ముగిసిన పయనం.. మరువలేని జ్ఞాపకం!

ముగిసిన పయనం.. మరువలేని జ్ఞాపకం!

ముగిసిన పయనం.. మరువలేని జ్ఞాపకం!
13-04-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా వీడ్కోలు వేడుకలు

​చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఐరా గ్లోబల్ స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం (ఫేర్‌వెల్ పార్టీ) సోమవారం అత్యంత వైభవంగా, ఉద్విగ్నత భరిత వాతావరణంలో జరిగింది. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో హాజరై సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ పాఠశాల ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలనునెమరువేసుకున్నారు.జూనియర్ విద్యార్థులు తమ సీనియర్ల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థుల నృత్యాలు, పాటలు, నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీనియర్ విద్యార్థులకు జూనియర్లు జ్ఞాపికలను అందజేసి వారి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ అరుణ, కరస్పాండెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. వీడ్కోలు అంటే పయనం ముగియడం కాదని, ఉన్నత లక్ష్యాల వైపు సాగే మరో ప్రయాణానికి ప్రారంభమని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ముగిసిన పయనం.. మరువలేని జ్ఞాపకం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News