Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:09 PM

ముగ్గురు ఐఏఎస్ లను పెళ్లి చేసుకున్న ఐఏఎస్ అధికారి

ముగ్గురు ఐఏఎస్ లను పెళ్లి చేసుకున్న ఐఏఎస్ అధికారి

ముగ్గురు ఐఏఎస్ లను పెళ్లి చేసుకున్న ఐఏఎస్ అధికారి
February 18, 2026 08:50 AM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఈరోజుల్లో అమ్మాయిలు దొరక్కా ఎంతో మంది అబ్బాయిలు రోడ్డు మీద తిరుగుతున్నారు.వయసు పైబడుతున్నా..వెంట్రుకలు మెరిసిపోతున్నా పెళ్లి కాని ప్రసాద్‌లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కానీ మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ఐఏఎస్ అధికారి నిత్య పెళ్లి కొడుకులా మారిపోయాడు. ఒక్కటి కాదు..రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు.ముగ్గురు భార్యలు కూడా కీలకమైన బ్యూరోక్రాట్లు కావడం విశేషం.ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు? ఆయన కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.


అవీ ప్రసాద్.. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందినవాడు.ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి.ప్రభుత్వంలో కీలక పొజిషన్‌లో ఉన్నాడు. 2013లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్)కి ఎంపికయ్యాడు.ఈ ఉద్యోగం నచ్చలేదో ఏమో తెలియదు గానీ మళ్లీ 2014లో యుపిఎస్సి పరీక్షలో 13వ ర్యాంకు సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) లో స్థానం సంపాదించాడు.ఈ క్రమంలో ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు రిజు బాఫ్నా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఆమెతో ఉన్న పరిచయంతో అవీ ప్రసాద్ వివాహం చేసుకున్నాడు.కానీ ఈ పెళ్లి ఎన్నేళ్లు నిలవలేదు. కొన్ని రోజులకే పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.


అలా మొదటి వివాహం ముగిసిందో లేదో… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి మిషా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మధ్యప్రదేశ్ కేడర్‌లో చేరింది.ప్రస్తుతం రత్లాం కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మళ్లీ ఏమైందో.. తెలియదు గానీ నాలుగేళ్ల పాటు బాగానే ఉన్నారు. ఈమెతో కూడా అవీ ప్రసాద్ విడిపోయాడు. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.


ఇద్దరు కలెక్టర్లతో పెటాకులైన తర్వాతైన బుద్ధిగా ఉండాల్సిన అవీ ప్రసాద్ ముచ్చటగా మూడోసారి 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అంకితా ధాకరే మెడలో కూడా మూడు ముళ్లు వేసేశాడు.ఫిబ్రవరి 11న కునో నేషనల్ పార్క్‌లో ఒక సాధారణ వేడుకలో వివాహం చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం అంకితా ధాకరే రాష్ట్ర మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.కొంత మంది వ్యక్తిగతం అనగా.. ఇంకొందరు తప్పుపట్టారు. మరికొందరు ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తున్నారు.


ఇదిలా ఉంటే మూడవ వివాహం గురించి ఇప్పటి వరకు అవి ప్రసాద్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు.ప్రస్తుతం అయితే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఇక అవి ప్రసాద్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉపాధి హామీ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈవో)గా పనిచేస్తున్నారు.గతంలో అనేక జిల్లాల్లో కలెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.ఈ నిత్య పెళ్లి కొడుకైన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News