Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:27 PM

మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం

24-02-2026 142 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం పరిధిలోని బోగార గ్రామానికి చెందిన కనుక సత్తయ్య ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుడి నివాసానికి చేరుకున్న గ్రామ సర్పంచ్, ప్రథమ పౌరుడు కూనూరు సాయికుమార్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని సత్తయ్య కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై మృతుడికి నివాళులర్పించారు.

అకాల మరణంతో కుటుంబం దుఃఖసంద్రంలో మునిగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజాప్రతినిధులు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

Sthanikam

మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం పరిధిలోని బోగార గ్రామానికి చెందిన కనుక సత్తయ్య ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుడి నివాసానికి చేరుకున్న గ్రామ సర్పంచ్, ప్రథమ పౌరుడు కూనూరు సాయికుమార్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని సత్తయ్య కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై మృతుడికి నివాళులర్పించారు.

అకాల మరణంతో కుటుంబం దుఃఖసంద్రంలో మునిగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజాప్రతినిధులు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News