Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

“మండపేట పరువు హత్య: ప్రేమ వివాహానికి బలైన జంట”– డా. మార్షల్ దుర్గం నగేష్ తీవ్ర ఆగ్రహం

“మండపేట పరువు హత్య: ప్రేమ వివాహానికి బలైన జంట”– డా. మార్షల్ దుర్గం నగేష్ తీవ్ర ఆగ్రహం

“మండపేట పరువు హత్య: ప్రేమ వివాహానికి బలైన జంట”– డా. మార్షల్ దుర్గం నగేష్ తీవ్ర ఆగ్రహం
March 02, 2026 12:33 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి (కోనసీమ) జిల్లామండపేట మండలంలో జరిగిన కులాంతర ప్రేమ వివాహం పరువు హత్య ఘటనపై సమతా సైనిక దళ్ (ఎస్‌ఎస్‌డీ) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. మార్షల్ దుర్గం నగేష్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా ప్రేమ వివాహం చేసుకున్న జంటపై కుల పేరుతో దాడి చేసి భర్తను దారుణంగా హత్య చేయడం “నాగరిక సమాజానికే సిగ్గుచేటు” అని ఆయన అభివర్ణించారు.

ఘటన వివరాలు, ఆయణ విమర్శ

వివాహంచేసుకున్న జంట సూర్యప్రకాశ్, సంధ్యలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు; సంధ్య రాయవరం డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తోంది, సూర్యప్రకాశ్ వేములపల్లిలో బట్టల వ్యాపారం చేసే వ్యక్తి. వారిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకునిగురువారం అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆదివారం రాత్రి సంధ్య అన్నదమ్ములు భర్త సూర్యప్రకాశ్‌పై రాళ్లతో దాడి చేసి ప్రాణాలు తీసే దారుణంచేశారు; ఈ ఘటనే ప్రేమ జంట హత్య, పరువు హత్యగా ప్రజల్లో కలకలం సృష్టించింది. ఈ విషయంపై ఆదివారం జారీ చేసిన ప్రకటనలో డా. మార్షల్ దుర్గం నగేష్ మాట్లాడుతూ, ప్రేమించి చట్టబద్ధంగా వివాహం చేసుకున్న జంటను గౌరవించాల్సిన సమాజం కులం పేరుతో దాడి చేసి భర్తను చంపివేయడం “అమానుష చర్య, నాగరికతకే మచ్చ” అని ఖండించారు. ఆయన తల్లి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంటికి పిలిపించి దారుణంగా హత్య చేయడం “క్రూరత్వం పరాకాష్ట”గా పేర్కొన్నారు.

కఠిన చర్యలు, ప్రభుత్వంపై డిమాండ్లు

ఈ ఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠినశిక్ష విధించాలని డా. నగేష్ డిమాండ్ చేశారు. భర్తను కోల్పోయిన సంధ్యకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాలని, బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని కూడా కోరారు. ప్రేమ వివాహాలు ఎంచుకున్న జంటలకు రక్షణ కల్పించడంలో పోలీసు వ్యవస్థ విఫలమవుతోందని ఆయన విమర్శించారు. ఇలాంటిపరువు హత్యలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు, వాటి కఠిన అమలు అవసరమని, కులం పేరుతో ప్రాణాలు తీసే దారుణాలను సమాజం ఖండించాలని డా. మార్షల్ దుర్గం నగేష్ పిలుపునిచ్చారు. పౌరస్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కుల నిర్మూలన, సమతా చైతన్యం కోసం సమాజం ముందుకురావాలని ఆయన సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News