Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:34 AM

మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు

26-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజావాణి’ సేవలను మరింత విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని దశలవారీగా విస్తరించి, రెవెన్యూ డివిజన్ స్థాయి నుంచి మండల స్థాయికి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేసి నిర్ణీత గడువులో పరిష్కరించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు పరిష్కారం పురోగతిని అర్జీదారులకు నిరంతరం తెలియజేయాలని పేర్కొన్నారు.

ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏకీకృత డిజిటల్ వేదికను ఏర్పాటు చేయాలని, రియల్ టైమ్ పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. పరిష్కారం కాని ఫిర్యాదులు స్వయంచాలకంగా పైస్థాయికి చేరే విధంగా ‘ఆటో ఎస్కలేషన్’ వ్యవస్థను అమలు చేయాలని తెలిపారు.

Sthanikam

మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు

Article Image

హైదరాబాద్: ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజావాణి’ సేవలను మరింత విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని దశలవారీగా విస్తరించి, రెవెన్యూ డివిజన్ స్థాయి నుంచి మండల స్థాయికి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేసి నిర్ణీత గడువులో పరిష్కరించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు పరిష్కారం పురోగతిని అర్జీదారులకు నిరంతరం తెలియజేయాలని పేర్కొన్నారు.

ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏకీకృత డిజిటల్ వేదికను ఏర్పాటు చేయాలని, రియల్ టైమ్ పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. పరిష్కారం కాని ఫిర్యాదులు స్వయంచాలకంగా పైస్థాయికి చేరే విధంగా ‘ఆటో ఎస్కలేషన్’ వ్యవస్థను అమలు చేయాలని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News