Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు

మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు

మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు
February 18, 2026 05:47 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

భూ వివాదాన్ని క్షేత్ర స్థాయిలో విచారించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కు హైకోర్టు ఆదేశం

గడువు ముగిసినా ఎలాంటి చర్యలు తీసుకోని కలెక్టర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ శిక్ష విధించిన హైకోర్టు భూ వివాదానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా కూడా విధించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడటం రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. కేసు వివరాల్లోకి వెళితే... భూహక్కులకు సంబంధించి ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారించిన హైకోర్టు, వివాదంలోని ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో, న్యాయస్థానం విధించిన గడువు ముగిసినా కలెక్టర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మహిళ మళ్లీ కోర్టును ఆశ్రయించి, కలెక్టర్ తన సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేశారని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయకపోవడం న్యాయ వ్యవస్థను అవమానించడమే” అని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ తీర్పుపై కలెక్టర్ రాహుల్ రాజ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News