Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:42 AM

మే 11 గృహ గణనకు సన్నాహాలు వేగవంతం చేయాలి.శ్రీమతి భారతి హోళికేరి

13-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రంలో మే 11న నిర్వహించనున్న గృహ గణన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన అధికారి శ్రీమతి భారతి హోళికేరి సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గృహ గణనపై అవసరమైన దిశానిర్దేశం చేశారు. గణన విజయవంతం కావాలంటే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సరైన వివరాలు అందించాలని పిలుపునిచ్చారు.

హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా బ్లాకులు రూపొందించడం, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేపట్టి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇండ్ల గణన, జనగణన వివరాల ఆధారంగా అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థంగా అందించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని తెలిపారు. విద్యావంతులు, ఉద్యోగులు ముందుండి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన అదనపు గణనాధికారి భాస్కరరావు, జిల్లా సెన్సస్ అధికారి శ్రీమతి జయమ్మ, సీపీఓ కార్యాలయ సిబ్బంది రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Sthanikam

మే 11 గృహ గణనకు సన్నాహాలు వేగవంతం చేయాలి.శ్రీమతి భారతి హోళికేరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News