Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 03:22 PM

ముంబయిలో తెలంగాణ ప్రజా సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

05-01-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

తెలంగాణ రాష్ట్రం నుంచి ముంబయికి వచ్చి గోరేగావ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలతో ఏర్పడిన తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పరమేష్ భీమనపల్లి 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్‌ ను ఘనంగా ఆవిష్కరించారు. ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమం సంఘ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపింది, ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంబయిలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు అందించడమే తెలంగాణ ప్రజా సంఘం లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి నర్సి రెడ్డి మన్నే పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సంఘ ఉపాధ్యక్షులు అంజయ్య సుక్క, కృష్ణ కురుపాటి, కోశాధికారి మల్లేష్ సూర్వి, సహాయ కార్యదర్శులు మల్లేష్ గాదె, నర్సింహా నాయక్, శ్రీను, శ్రీనివాస్ చుక్క సంఘ సలహాదారులు విరమళ్ళ మల్లేష్, స్వామి లకేలపల్లి, శేఖర్ వంటెపాక, గణేష్ మచ్చతో పాటు ఇతర సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ముంబయిలో తెలంగాణ ప్రజా సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News