Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:20 AM

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన రన్

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన రన్

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన రన్
22-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యువతలో చైతన్యం కల్పించాలి: జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి,: యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన అత్యంత అవసరమని మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నారాపల్లి నందనవనంలో శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ లైఫ్” పేరుతో నిర్వహించిన భారీ అవగాహన రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

16కే, 10కే, 5కే, 3కే విభాగాల్లో జరిగిన ఈ రన్‌లో వందలాది మంది యువత, విద్యార్థులు, మహిళలు, ఫిట్‌నెస్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. “డ్రగ్స్ వద్దు – పుస్తకాలే ముద్దు” వంటి నినాదాలతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ అనే సామాజిక వ్యాధి యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, ప్రతి కుటుంబం ఈ సామాజిక పోరాటంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పాల్గొన్న రన్నర్లకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు.

సీఐ మక్బూల్ జాని మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం చట్టరీత్యా నేరమని, యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్.వి ఫౌండేషన్ ప్రతినిధులు, తుంగతుర్తి రవి, వాకిటి శ్రీకాంత్ రెడ్డి, నిర్వాహకులు సోమశేఖర్, శేఖర్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన రన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News