Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:52 AM

మట్టి నమూనాల సేకరణపై మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన

09-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా మునగాల మండలంలోని మోడల్ స్కూల్‌ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల చేత రైతుల పొలాల నుంచి మట్టి నమూనాల సేకరణ, వాటి ఫలితాల విశ్లేషణ, రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీతో పాటు పంటలకు అవసరమైన పోషకాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం మోడల్ స్కూల్‌లో 7వ, 8వ, 9వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణ ఆవశ్యకత, నమూనాలు తీసుకునే విధానాన్ని ప్రాయోగికంగా వివరించారు. మట్టినాణ్యత తెలుసుకోవడం ద్వారా పంట దిగుబడులు పెరుగుతాయని, ఎరువుల వినియోగం సమర్థవంతంగా ఉంటుందని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. రాజు, వ్యవసాయ విస్తరణాధికారులు భవాని, నాగు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సైదయ్య గౌడ్, ఉపాధ్యాయుడు సైదులు పాల్గొని విద్యార్థులకు సూచనలు చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

మట్టి నమూనాల సేకరణపై మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News