Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:23 AM

మసీదుల వద్ద మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

18-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలకు అన్ని వసతులు కల్పించాలి

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మసీదుల వద్ద అవసరమైన మౌలిక వసతులు సమకూర్చాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ మీటింగ్ హాలులో రంజాన్ మాసం పురస్కరించుకొని శాంతి సంఘ సమావేశం అదనపు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ ఏర్పాట్లకు సంబంధించి ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో, సమయపాలనతో నిర్వహించాలని సూచించారు.

ప్రత్యేకంగా నమాజ్ సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, మసీదుల వద్ద కరెంట్, మంచినీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మసీదుల పరిసరాల్లో పటిష్ట పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు వీధి దీపాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీ వార్డులలో మంచినీరు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, సరఫరాలో ఎలాంటి అంతరాయాలు రాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు.

రంజాన్ మాసాన్ని సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, జిల్లా మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ రంజాన్ మాసంలో మసీదుల వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భద్రతా పరమైన అన్ని చర్యలు చేపట్టి, మత పెద్దలతో సమన్వయం సాధించి సామరస్య వాతావరణంలో ప్రార్థనలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Sthanikam

మసీదుల వద్ద మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News