Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:27 PM

మార్చిలోనే పరిషత్ ఎన్నికలు..? రూ.450 కోట్ల నిధులే ప్రధాన కారణం

12-02-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వేగంగా కదులుతున్న రాష్ట్ర ప్రభుత్వం – తొలి వారంలో రెండు విడతల పరిశీలన

హైదరాబాద్

తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను మార్చి నెలలోనే నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు వేగవంతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే అదే ఊపును కొనసాగిస్తూ పరిషత్ ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న అవసరం ప్రభుత్వ ముందున్న ప్రధాన అంశంగా మారింది. ఈ ఏడాది లోపల పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోతే జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.450 కోట్ల నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రమాలపై దాని ప్రభావం పడే అవకాశముండటంతో ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనే దిశగా యంత్రాంగం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రాథమిక సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. మార్చి తొలి వారంలో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించే అవకాశాలపై పరిశీలన జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం సాధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. రాజకీయంగా కూడా ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ బలం నిరూపించుకోవాలనే లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. మునిసిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం పరిషత్ ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో అన్ని పార్టీల దృష్టి గ్రామీణ ఓటర్లపై కేంద్రీకృతమైంది.ఆర్థిక పరిమితులు, రాజకీయ లెక్కలు కలిసివచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల వేడి త్వరలోనే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత రానుంది.

Sthanikam

మార్చిలోనే పరిషత్ ఎన్నికలు..? రూ.450 కోట్ల నిధులే ప్రధాన కారణం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News