Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:34 PM

మనోవిజ్ఞాన శాస్త్రంలో శ్రీవేణికి డాక్టరేట్

02-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్:

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయంలో సేవలందిస్తున్న డి. శ్రీవేణికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మనోవిజ్ఞాన శాస్త్రంలో డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ ఘనతతో విద్యా లోకంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం మనోవిజ్ఞాన విభాగం విభాగాధిపతి బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీవేణి, మేధో వికలాంగులు వృత్తి ఆధారిత ఉపాధి కేంద్రాలలో పనిచేస్తున్న సందర్భంలో వారి ఆత్మవిశ్వాసం, పనితీరు తీరుపై లోతైన పరిశోధన నిర్వహించారు.

ఈ పరిశోధనకు మేధో వికలాంగుల జాతీయ సాధికార సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన డాక్టర్ సరోజ్ ఆర్య మార్గదర్శకత్వం వహించారు. మేధో వికలాంగులలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీసి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఈ అధ్యయనం కీలకంగా నిలుస్తుందని విశ్వవిద్యాలయ వర్గాలు అభిప్రాయపడ్డాయి.కుటుంబ బాధ్యతలు, బోధన, పరిపాలనా విధులు సమన్వయం చేసుకుంటూ ఎన్నో సంవత్సరాల నిరంతర శ్రమ తర్వాత డాక్టరేట్ సాధించడం ప్రశంసనీయం అని సహచరులు కొనియాడుతున్నారు. ఈ విజయం యువ పరిశోధకులు, అధ్యాపకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులు, సహచర అధ్యాపకులు, విద్యావేత్తలు శ్రీవేణికి శుభాకాంక్షలు తెలిపారు. సమగ్ర విద్య, సామాజిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న ఈ పరిశోధన భవిష్యత్ పరిశోధకులకు దిశానిర్దేశకంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

Sthanikam

మనోవిజ్ఞాన శాస్త్రంలో శ్రీవేణికి డాక్టరేట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News