Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:33 PM

మానవీయ విలువల పునరుజ్జీవానికి గ్రంథాలయ ఉద్యమం

01-02-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సృజనాత్మక శక్తుల వెలికితీతే లక్ష్యంగా బస్సు యాత్ర

నేటి ఆధునిక జీవన విధానంలో క్రమంగా అంతరించిపోతున్న మానవీయ విలువలను పునరుద్ధరించడంతో పాటు, చరవాణీ మోజులో మునిగిపోయి పిల్లలు కోల్పోతున్న సృజనాత్మక శక్తులను వెలికి తీయాలన్న లక్ష్యంతో ప్రారంభమైన మరో మాతృభాష ఉద్యమమే గ్రంథాలయ ఉద్యమమని ‘మరో గ్రంథాలయ ఉద్యమ బస్సు యాత్ర’ నాయకులు మంచి కంటి, బండారు విజయ తెలిపారు.

ఆదివారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన బస్సు యాత్ర మధ్యాహ్నం భువనగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా భువనగిరిలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద సాహితీ మిత్రులు, ప్రజాసంఘాల ప్రతినిధులు బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు.అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో బస్సు యాత్ర రాష్ట్ర బాధ్యురాలు బండారు విజయ మాట్లాడుతూ, ప్రజల నుంచి గ్రంథాలయాల అభివృద్ధి కోసం వసూలు చేసిన పన్నును అదే ప్రయోజనానికి వినియోగించడం లేదని విమర్శించారు. యువత విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించడానికి పుస్తక పఠనం నిత్య జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మరో రాష్ట్ర బాధ్యుడు మంచి కంటి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో పాఠశాలల్లో, ఇళ్లలో చిన్న చిన్న గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకుని పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకోవాలని ప్రజలను కోరారు

.ఈ కార్యక్రమంలో బస్సు యాత్ర రాష్ట్ర బాధ్యులు కస్తూరి ప్రభాకర్, కాసుల రవికుమార్, మలుపు బాల్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా బాధ్యులు కొడారి వెంకటేష్, బట్టు రామచంద్రయ్య, శ్రీనివాసాచారి, బర్రె సుదర్శన్, జంపాల అంజయ్య, పోలి శంకర్ రెడ్డి, శోభ, సిరిపంగ శివలింగం, జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథపాలకుడు జంపయ్య, గ్రంథాలయ పాఠకులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మానవీయ విలువల పునరుజ్జీవానికి గ్రంథాలయ ఉద్యమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News