Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

మల్లికార్జున నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

07-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రహదారులు, డ్రైనేజీ, పార్క్, కమ్యూనిటీ హాల్‌కు ఊపొచ్చిన పనులు

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన జరిగింది. డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మల్లికార్జున నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న పనులకు ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.కాలనీ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రోడ్ నంబర్–1లో మిగిలిన డ్రైనేజీ పైపులైన్ పనులు, రోడ్డు అభివృద్ధి పనులు, కాలనీ పార్క్‌లో నూతన వ్యాయామ పరికరాల ఏర్పాటు, టెంపుల్ రోడ్‌లో ప్లాట్ నంబర్ 68 నుంచి 80 వరకు నూతన డ్రైనేజీ పైపులైన్ పనులు, కమ్యూనిటీ హాల్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాషం అశోక్ గౌడ్, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ డైరెక్టర్ కవిత హాజరయ్యారు.అలాగే సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏనుగు నర్సిరెడ్డి, ఉపాధ్యక్షుడు పి. వెంకట రెడ్డి, గౌరవాధ్యక్షుడు డాక్టర్ యాళ్ల ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సాయి చరణ్, కోశాధికారి ఎం.డి. షరీఫ్, సంయుక్త కార్యదర్శి ఎం.డి. మహమ్మద్, కార్యవర్గ సభ్యులు అంబటి భగవంత్ రెడ్డి, టి. రవీందర్, యుగంధర్ రెడ్డి, కిరణ్ కుమార్, ఎం. మోహన్ రెడ్డి, ఎం.డి. జియా, ఏ.ఏ. ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

కాలనీ దేవాలయ కమిటీ చైర్మన్ వి. వెంకటేశ్వర రావు, సీనియర్ సభ్యులు, వృద్ధులు, వివిధ కాలనీల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు, కాలనీ వాసులందరికీ మల్లికార్జున నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

Sthanikam

మల్లికార్జున నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News