Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:45 PM

మల్లన్న గుట్టపై అర్ధరాత్రి లింగోద్భవ మహాభిషేకం భక్తులతో కిక్కిరిసిన చిన్న శ్రీశైలం

మల్లన్న గుట్టపై అర్ధరాత్రి లింగోద్భవ మహాభిషేకం భక్తులతో కిక్కిరిసిన చిన్న శ్రీశైలం

మల్లన్న గుట్టపై అర్ధరాత్రి లింగోద్భవ మహాభిషేకం భక్తులతో కిక్కిరిసిన చిన్న శ్రీశైలం
February 16, 2026 02:05 AM 286 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం నిదానపల్లి (చిన్న శ్రీశైలం) లో మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి.

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు, మహామంగళహారతులు వైభవంగా జరిగాయి. అర్చకులు బేతోజు శశిధర్ దీక్షితులు, అన్వేష, నాగరాజు శాస్త్రి వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం “ఓం నమః శివాయ” నినాదాలతో మార్మోగింది.

ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు భాష మళ్ల బాలరాజు, సుంకు స్వామి, ఆగు చిన్న లింగస్వామి, మాజీ సర్పంచ్ గుత్త నర్సింహారెడ్డి, మందడి సంతోష్ రెడ్డి, గ్రామ పెద్దలు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News