Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:23 AM

మల్లన్న ఆశీస్సులతో విజయం – మొక్కు తీర్చుకున్న కునూరి మహేష్ గౌడ్

18-02-2026 368 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం భక్తిరసంతో కళకళలాడింది. డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా కూనూరు సాయికుమార్ గౌడ్ గెలిస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తానని మొక్కుకున్న కునూరి మహేష్ గౌడ్ తన మాట నిలబెట్టుకున్నారు.

ఎన్నికల్లో సాయికుమార్ గౌడ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి మహేష్ గౌడ్ ఘనంగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సేవలను నిర్వహించారు. శివరాత్రి వేళ ఆలయం వద్ద భక్తుల రద్దీ ఉధృతంగా కనిపించింది. మంత్రోచ్చారణల నడుమ జరిగిన సేవలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత గంభీరంగా మలిచాయి.

ఈ సందర్భంగా సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ, “మల్లన్న స్వామి కోరిన కోరికలు తీర్చే దైవం. స్వామివారి కృపా కటాక్షాలతోనే ఈ విజయాన్ని సాధించగలిగాం. గ్రామ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాం” అని స్పష్టం చేశారు.

Sthanikam

మల్లన్న ఆశీస్సులతో విజయం – మొక్కు తీర్చుకున్న కునూరి మహేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News