Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 06:51 PM

మహాశివరాత్రికి శ్రీశైలంలో ఉచిత బస్సులు

మహాశివరాత్రికి శ్రీశైలంలో ఉచిత బస్సులు

మహాశివరాత్రికి శ్రీశైలంలో ఉచిత బస్సులు
08-02-2026 190 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేకంగా నిర్వహణ

శ్రీశైల దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటుండటంతో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.భక్తులు దిగిన ప్రదేశాల నుంచి దర్శన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా కైలాసద్వారం నుంచి శ్రీశైలం వరకు ఉచిత బస్సులు నడపబడుతున్నాయి. అదేవిధంగా నందిగుడి సర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠం జంక్షన్, మల్లమ్మకన్నీరు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, రుద్రాపార్కు, సిద్ధరామప్ప కొలను, పాతాళగంగ రోడ్డు, ప్రైవేటు సత్రాల మీదుగా తిరిగి నందిగుడి సర్కిల్‌కు చేరుకునేలా రూట్‌ను ఏర్పాటు చేశారు.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 8, 9 తేదీలలో నాలుగు బస్సులు, ఫిబ్రవరి 10, 11 తేదీలలో రోజుకు ఎనిమిది బస్సులు, ఫిబ్రవరి 12 నుంచి 16 తేదీల వరకు రోజుకు పది బస్సులను నడపనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఈ ఉచిత బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

Sthanikam

మహాశివరాత్రికి శ్రీశైలంలో ఉచిత బస్సులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News