Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:15 AM

మైనారిటీ పథకాల దరఖాస్తులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ జనవరి 10 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం

05-01-2026 234 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం, ఆర్థిక భద్రత లక్ష్యంగా ప్రవేశపెట్టిన “రేవంత్ అన్నకా సహారా – మిస్కీనో కే లియే”, “ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన” పథకాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణను మళ్లీ ప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం. జయమ్మ వెల్లడించారు.

సాధారణ ఎన్నికల కోడ్ కారణంగా 2025 సెప్టెంబర్ 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పేద మైనారిటీ అభ్యర్థులు ప్రయోజనాలు పొందలేకపోయారని, వారి నుంచి వచ్చిన భారీ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ మైనారిటీ ఆర్థిక సంస్థ, హైదరాబాద్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు.

అర్హత కలిగిన మైనారిటీ అభ్యర్థులు 2026 జనవరి 5 ఉదయం 10.30 గంటల నుంచి జనవరి 10 రాత్రి 11.59 గంటల వరకు

https://tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

మరిన్ని వివరాల కోసం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నెం. F-16, మొదటి అంతస్తు, కలెక్టర్ కార్యాలయం, రాయగిరి – భువనగిరి లేదా 95056 40004 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం. జయమ్మ సూచించారు.

Sthanikam

మైనారిటీ పథకాల దరఖాస్తులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ జనవరి 10 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News