Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:36 PM

లోపాలకు తావులేదు – రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి స్పష్టం

31-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్‌కు గట్టి ఆదేశాలు

హైదరాబాద్

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత కట్టుదిట్టంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమం ఎన్నికల వ్యవస్థలో కీలకమైనదని పేర్కొన్నారు.శనివారం హైదరాబాద్ నుండి వీడియో సమావేశం ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ పూర్తి చేయాలని, దీనిలో నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు.మ్యాపింగ్ వేగవంతం చేసేందుకు గ్రామ పాలన అధికారులు, ఇతర సిబ్బందిని సహాయకులుగా నియమించాలని, బూత్ స్థాయి అధికారులకు పూర్తి స్థాయి సహకారం అందించాలని ఆదేశించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమన్వయం పెంచి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకంపై అవగాహన కల్పించాలని సూచించారు.

బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ మ్యాపింగ్ నిర్వహించాలని, వారి పర్యవేక్షకులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని తెలిపారు. నలభై సంవత్సరాల లోపు మహిళల మ్యాపింగ్‌ను తల్లిదండ్రుల వివరాల ఆధారంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, అస్పష్టమైన ఫోటోలు, పునరావృత నమోదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు స్పష్టంగా తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఎన్నికల విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లోపాలకు తావులేదు – రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి స్పష్టం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News